ETV Bharat / state

POLICE STATION: వరదల ప్రభావం.. నీట మునిగిన ఠాణా - అల్లూరి జిల్లా తాజా వార్తలు

POLICE STATION: ఎగువున కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చాలా వరకు లంక గ్రామాలు నీటమునిగి జనజీవనం స్తంభించింది. తాజాగా అల్లూరి జిల్లాలోని ఎటపాక పోలీస్​స్టేషన్​లోకి నీరు వచ్చి చేరింది. వరద వచ్చి చేరడంతో స్టేషన్​కి తాళాలు వేసి బయటికి వచ్చారు.

flood water at police station
flood water at police station
author img

By

Published : Jul 14, 2022, 5:23 PM IST

పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించిన వరద నీరు

POLICE STATION: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎటపాక పోలీస్​స్టేషన్‌ను వరద ముంచెత్తింది. వరదల కారణంగా సీఐ కార్యాలయం నీట మునిగి.. మూడు అడుగుల మేర నీరు వచ్చి చేరింది. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. పోలీసులు ఠాణాకు తాళాలు వేసి బయటకు వెళ్లిపోయారు. రికార్డులు ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎస్సై పార్థసారధి చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని వాహనాలన్నీ నీట మునిగాయని తెలిపారు. ఎటపాక మండలంలో.. సుమారు 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

ఎటపాక, కూనవరం అతలాకుతలం: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తుండటంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. రాయనపేట, నెల్లిపాక, కన్నాయిగూడెం, మురుమూరు ప్రధాన, జాతీయ రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రాకపోకలు స్తంభించాయి. కూనవరం మండలంలో 15 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లో 6,500 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. దాదాపు 25,000 మంది నిరాశ్రయులైనట్లు చెప్పారు. దేవీపట్నం వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొండమొదలు పంచాయతీలోని గ్రామాల ప్రజలు కొండలపైనే ఉంటున్నారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్దకు భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం పైభాగంలో ఉన్న పోశమ్మగండి- పూడిపల్లి గ్రామాలకు వరద నీరు పోటెత్తింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.