ముఖ్యమంత్రి జగన్.. దావూద్ ఇబ్రహీంను మించిపోయారు:చంద్రబాబు
తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని నమ్మి.. ప్రజలు మోసపోయారని తెలిపారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన దేవనకొండలో రోడ్ షో నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోలవరంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు, అంగీకరించలేదు
పోలవరం దిగువ కాఫర్ డ్యాం పనులు జనవరి నెల చివరికల్లా పూర్తి చేస్తామని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని కృష్ణా గోదావరి భవన్‌లో .. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన భేటీలో ఆయన పాల్గొన్నారు. పోలవరం పనుల లక్ష్యాలు, వనరులపై చర్చించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దిల్లీ మద్యం కుంభకోణంతో శరత్ చంద్రారెడ్డి భార్యకు సంబంధం ఉందా..?
దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతనెల 17న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ లేఖ రాశారు. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతున్న జెట్ సెట్ గో విమానయాన సంస్థ వివరాలను కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వైకాపా నాయకుల వేధింపులు.. నిండు ప్రాణం బలి
తమ ఇంటిని కూల్చి వేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లీకుమారులలో తల్లి కామాక్షి ఈ రోజు మృతి చెందారు. కాకినాడలో చికిత్స పొందుతూ మరణించారు. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడే ముందు తల్లికుమారులు సెల్ఫీ వీడియో తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నదిలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి
జమ్ముకశ్మీర్ మార్వాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కారు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయత్రం మార్వాలోని రాచల్ ప్రాంత సమీపంలో ఓ కారు వాగులో పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరో శ్రద్ధా వాకర్ తరహా ఘటన.. ప్రియురాలిని హత్య చేసి మృతదేహంతో వీడియో!
ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ ప్రియుడు. ఈ కిరాతక ఘటన నవంబర్ 8న మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్‌పింగ్ అసహనం.. వీడియో వైరల్!
జీ20 వేదికగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు పట్ల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భారత్‌లోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇదే! ధర, ఫీచర్స్ చూశారా?
అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! ముంబయికి చెందిన ఓ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ రూ.5 లక్షలలోపే ఓ కారును తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ కారు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మన హైదరాబాద్‌లో 'ఫార్ములావన్ కార్ రేస్!'.. అభిమానులకు కిక్కే కిక్కు!
ఫార్ములావన్ కారు రేసింగ్ అంటే తెలియనివారెవరు ఉండరు. సరిగ్గా అలాంటి రేసింగ్ లీగ్‌కు ఇప్పుడు మన హైదరాబాద్ వేదిక కానుంది. ఆ రేసు ఎప్పటి నుంచో.. ఎన్ని జట్లు పాల్గొంటున్నాయో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాక్ ఆఫ్ ది టౌన్‌గా విజయ్ దేవరకొండ.. ఆ ప్రకటనతో ఎంతో మందికి స్ఫూర్తిగా!
దేశవ్యాప్తంగా రౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న ఆయన.. తాజాగా మరో మంచి పని చేసేందుకు ముందుకు వచ్చారని తెలిసింది. మరణించిన తర్వాత మరో నలుగురికి తన దేహం ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.