ETV Bharat / sitara

Samantha Defamation Suit: సమంత సంబంధిత వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశం - టాలీవుడ్​ వార్తలు

తనపై దుష్ప్రచారం చేసిన మూడు యూట్యూబ్​ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలంటూ సినీనటి సమంత దాఖలు చేసిన పిటిషనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించింది.

Samantha Defamation Suit updates
సమంత పరువు నష్టం పిటిషన్‌పై తీర్పు నేడే
author img

By

Published : Oct 26, 2021, 7:16 PM IST

Updated : Oct 27, 2021, 10:16 AM IST

సమంతకు సంబంధించిన వీడియోలు తొలగించాలని... రెండు యూట్యూబ్​ ఛానెళ్లు, సీఎల్​ రావుకు కూకట్​పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడని న్యాయస్థానం పేర్కొంది. పోస్టు చేసిన వీడియో లింకులను యూట్యూబ్‌ ఛానెళ్లు తొలగించాలని ఆదేశించింది. సమంత కూడా వ్యక్తిగత వివరాలు పోస్టు చేయకూడదని కోర్టు సూచించింది.

ఇదీ జరిగింది..

సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నటి సమంత (Samantha Defamation Suit) కోర్టుకెక్కారు. హైదరాబాద్​ కూకట్​పల్లి కోర్టు(Kukatpally Court)లో పరువునష్టం కేసు (Samantha Defamation Suit) నమోదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత కూకట్​పల్లి కోర్టులో పరువునష్టం దావా (Samantha Defamation Suit) దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్​లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు.

మీడియా, పత్రికల ద్వారా భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును సమంత కోరుతూ పిటిషన్ వేసింది.

ఇదీ చూడండి:

Samantha defamation case: సమంత అయినా.. సామాన్యులైనా.. కోర్టు ముందు ఒక్కటే!

Last Updated : Oct 27, 2021, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.