ETV Bharat / science-and-technology

మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!

"మనుషులకు తోక మొలిస్తే ఎలా ఉంటుందీ?" ఇదే ఆలోచన వచ్చింది సైంటిస్టులకు! వెంటనే రీసెర్చ్ మొదలు పెట్టారు.. మొత్తానికి తోకను సిద్ధం చేసేశారు!! ఇక, జనాలు అతికించుకోవడమే లేట్! ఇదేం విడ్డూరం..? మనిషికి తోకేందీ?? ఈ వెరైటీ ఆలోచన వచ్చిన ఆ మహానుభావులు ఎవరు??? ఇలా బోలెడు డౌట్లు వచ్చేస్తున్నాయా? రండి.. ఇచ్చట అన్ని సందేహాలూ తీర్చబడును.

ROBOTIC TAILS
ROBOTIC TAILS
author img

By

Published : Sep 8, 2022, 6:06 PM IST

ROBOTIC TAILS : ఓ సారి టైమ్ మెషీన్ ఎక్కేసి.. కాలంలో వెనక్కు ప్రయాణిద్దాం పదండి. అలా.. ఎక్కడిదాకా పోదామంటే.. మానవ పరిణామక్రమం ఆరంభం దాకా పోదాం. ఇక్కడ ఆగుదాం. మనిషి కోతి నుండి విడివడి.. రూపాంతరం చెందుతూ.. చెందుతూ.. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ గ్యాప్ లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైన ఛేంజ్ ఏమంటే.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయిందనే థియరీ చెప్పినారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమంటే.. ఆ తోకను మళ్లీ మొలిపించారు!

ROBOTIC TAILS
జంతువులకే కాదు మనుషులకు తోకలు

"ఏంటేంటేంటేంటీ...? మనిషికి తోకా? ఈ సైంటిస్టులకు పనీపాటా ఏమీ లేదా? ఈకలు.. తోకలు.. కోళ్లకు, కుక్కలకు బాగుంటాయి గానీ.. గీ మనుషులకేందిరా బై" అంటున్నారా? ఇదే ప్రశ్న వేస్తే.. "జస్ట్ చిల్ బ్రో" అంటున్నారా పరిశోధకులు. తాము అలాంటి పని ఎందుకు చేయాల్సి వస్తోందో ఇలా.. చెప్తున్నారు. వినుకోండి మరి...

దాదాపుగా ప్రతి జంతువుకూ.. ప్రతి పక్షికీ.. తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. పక్షి ప్రయాణ వేగం గణనీయంగా పడిపోతుంది. కొన్ని సరిగా ఎగరలేక పడిపోతాయి కూడా..

ROBOTIC TAILS
పక్షులకే కాదు మనుషులకు తోకలు

ఇక, జంతువుల్లో.. కంగారూను తీసుకుంటే.. దాని తోకను ఏకంగా ఐదో కాలుతో పోలుస్తారు సైంటిస్టులు. ఈ పోలిక చాలు.. దాని తోకకున్న కెపాసిటీ ఏంటో చెప్పడానికి! కేవలం తోక మీద నిలబడి నాలుగు కాళ్లతో అది ఫైట్ చేయగలదు. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.

ROBOTIC TAILS
జంతువులకే కాదు మనుషులకు తోకలు

ఇంకా.. మైదానంలో తిరుగాడే నాలుగు కాళ్ల జంతువులన్నీ.. పరిగెత్తాలన్నా.. నడవాలన్నా.. వాటి గమనాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తోక ఇతోధికంగా ఎంతో సాయం చేస్తుంది. ఈ విషయం మనకు తెలియకపోవచ్చుగానీ.. జంతు శాస్త్రవేత్తలకు చాలా బాగా తెలుసు. ఇలా.. తోకలు ప్రతీ జీవికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.

ROBOTIC TAILS
జంతువులకే కాదు మనుషులకు తోకలు

"వీటి సంగతి సరేగానీ.. మనిషికి ఈ తోక ఎందుకట..? తోక లేకున్నా ఇప్పుడు ఒరిగిపోయిందేమీ లేదుగదా.. ఎప్పుడో లక్షల ఏళ్లనాడు ఊడిపోయిన ఆ దిక్కుమాలిన తోకను తెచ్చి.. మళ్లీ ఇప్పుడు అతికించడం ఎందుకట..?" అని చిరాకు పడుతున్నారా? దానికీ కారణం చెబుతున్నారు సైంటిస్టులు.

ROBOTIC TAILS
మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్

ముసలితనం వచ్చిన తర్వాత ఏ జంతువైనా.. కర్ర పట్టుకొని నడవడం మీరు గమనించారా? లేదు కదా..! కానీ.. మనిషి మాత్రం వయసు మీదపడ్డాక కర్ర పట్టుకోవాల్సిందే. దీనికి కారణం.. తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేకపోవడమే. కానీ.. తోక ఉంటే.. కర్ర అవసరమే ఉండదని అంటున్నారు సైంటిస్టులు. నడక సైతం బ్యాలెన్స్ అవుతుందని అంటున్నారు. అందుకే.. మనిషికి తోకను తగిలించే పనిలో పడ్డామని చెబుతున్నారు జపాన్ లోని కీయో యూనివర్సిటీ పరిశోధకులు.

ROBOTIC TAILS
మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్

ఇప్పటికే.. ఒక మీటరు పొడవు ఉండే రోబోటిక్‌ తోకను ఆర్టిఫీషియల్ గా తయారు చేశారు. దీన్ని తగిలించుకుంటే.. అచ్చం జంతువుల తోక మాదిరిగానే పనిచేస్తుందట. ఈ తోక.. గడియారంలోని పెండ్యూలంలా కదులుతూ.. మనిషిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుందని కీయో వర్సిటీ పరిశోధకుడు జునిచి నబెషిమా చెప్తున్నారు. మరి, ప్రాక్టికల్ గా ఈ తోక ఎలా పని చేస్తుందో తెలియాలంటే.. కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఇదండీ.. "తోక 2.0" సంగతి. ఇలాంటి ఇంట్రస్టింగ్ స్టోరీల కోసం.. "ఈటీవీ భారత్" యాప్ ను ఇప్పుడే ఇన్ స్టాల్ చేసుకోండి.

ROBOTIC TAILS
మనుషులకు తోకలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.