ETV Bharat / lifestyle

రంగులు సరే... రవ్వంత జాగ్రత్త అవసరం - RANGOLI

రంగుల హోలీలో రవ్వంత జాగ్రత్త తీసుకుంటే పండగను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవచ్చంటున్నారు నిపుణులు.

హోలీ
author img

By

Published : Mar 21, 2019, 12:24 PM IST

హోలీ
హోలీ... చిన్నపెద్దా తేడా లేకుండా అందరిని ఏకం చేసేది. నీళ్లు, రంగులు, పూరేకులు చల్లుకుంటూ ఉత్సాహాన్ని నింపే పండగ. ఈ సంబురాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు.

ఆనందాలు వెల్లివిరియాలంటే ఇలా చేయండి

  • రంగులను గుప్పిళ్ల కొద్దీ తీసుకొని ఎడాపెడా చల్లడం, మొహమంతా పులమాలనే ఆలోచనలో కళ్లలో, ముక్కులో పోయడం వంటివి చేయకూడదు. ఊపిరితిత్తులు, జీర్ణకోశం దెబ్బతినే అవకాశం ఉంది.
  • హోలీ ఆడే ముందు శిరోజాలకి, ఒంటికి కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. రంగులను తేలికగా కడిగేయచ్చు.
  • కళ్లకు అద్దాలు పెట్టుకుంటే కళ్లలోకి రంగులు వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. తలకి స్కార్ఫ్ కట్టుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు.
  • సాధ్యమైనంత ఎక్కువగా శరీరాన్ని కప్పి ఉంచే బట్టలను వేసుకోవాలి. ఒంటికి రంగులు తక్కువగా అంటుకుంటాయి.
  • రంగుల్ని వదిలించుకోవాలంటే అదే పనిగా ఒంటిని రుద్దకూడదు. సీ సాల్ట్, గ్లిజరిన్ కలిపిన నీటితో కడిగి మైల్డ్ సోప్​తో రుద్దితే మేలు.
  • పొరపాటున రంగులు కంట్లో పడితే వెంటనే శుభ్రమైన చల్లటి నీళ్ళతో కడగాలి. కన్ను ఎరుపుగా మారినా, మంటపుట్టినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి
  • రంగునీళ్లను దూరం నుంచి కొడుతుంటే ఎదుటి వారికి దెబ్బలు తగులుతాయి. కిందపడిపోయే ప్రమాదమూ ఉంది. నీటిని వృథా చేయకుండా రంగులే చల్లుకుంటే మరీ మంచిది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.