అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మాల్లాపురంలో హత్య కేసు నమోదైంది. మద్యం మత్తులో వరుసకు అన్న అయ్యే చిన్నప్పని తమ్ముడు చంద్రశేఖర్ గొడ్డలితో నరికి చంపాడు. అడ్డొచ్చిన మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్తి తగాదాలు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదా వల్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని గ్రామస్థులు భావిస్తున్నారు. హత్య జరిగిన వెంటనే నిందితుడు పరారైనట్లు తెలుస్తోంది.
దేవస్థానం పక్కన అసభ్యకార్యకలాపాలు.. అడ్డుచెప్పిన వాచ్‌మన్‌పై దాడి