ETV Bharat / jagte-raho

ఆర్మీలో చేరేందుకు అర్హత లేదని యువకుడు ఆత్మహత్య - అమరావతి న్యూస్

సరిహద్దుల్లో కాపలాకాస్తూ దేశానికి సేవ చేయడం ఆ యువకుడి కల. నిత్యం దానికోసమే పరితపించేవాడు. తీరా తనకు ఆర్మీలో చేరేందుకు అర్హత లేదని తెలిసి ప్రాణమే వదిలేశాడు. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా, కుబీర్ మండల కేంద్రంలో జరిగింది.

young-man-who-could-not-join-the-army-committed-suicide-news
తెలంగాణ: బలవన్మరణానికి పాల్పడిన యువకుడు... శోకసంద్రంలో కుటుంబం...
author img

By

Published : Jan 17, 2021, 7:52 PM IST

చిన్న నాటి నుంచి కలలు కన్న ఆర్మీ ఉద్యోగంలో చేరలేనని తెలిసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుబీర్​కు చెందిన ప్రవీణ్... ఆర్మీలో ఉద్యోగం సాధించాలని చాలా కష్ట పడేవాడు. ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఈ మధ్యే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సన్నద్ధం అయ్యేందుకు మూడు రోజుల క్రితం ఓ ప్రయివేటు కోచింగ్ సెంటర్​కు ప్రవీణ్​ ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నాడు. వారు ఆ యువకుడి ఎత్తు, విద్యాభ్యాసం వివరాలు అడిగారు. తనకు ఆర్మీలో చేరడానికి కావలసిన ఎత్తు, సరిపడా మార్కులు లేవని వారు తెలిపారు. తన కల చెదిరిందని ప్రవీణ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

రోజు లాగే వాకింగ్​కి వెళ్లి..

రోజు లాగే ఆదివారం ఉదయం కూడా ప్రవీణ్​ వాకింగ్​కి వెళ్లాడు. ఎంత సేపయినా.. అతడు​ ఇంటికి తిరిగి రాకపోవటంతో పంటకు నీరు పెడుతున్నాడనుకొని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ప్రవీణ్​ తమ్ముడు పొలానికి వెళ్లి చూసినా అక్కడా లేకపోవటంతో కంగారు పడి చుట్టు పక్కల వెతికాడు. తమ చేను గట్టు పక్కనే ఉన్న చింతచెట్టుకు వేలాడుతున్న ప్రవీణ్​ మృతదేహాన్ని చూసి భయాందోళనలకు గురై కుటుంబ సభ్యులకు చెప్పాడు.

కన్నీరు పెట్టించిన దృశ్యాలు..

ఎలాగైనా ఆర్మీ ఉద్యోగంలో చేరి తమకు పేరు తీసుకొస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చుడండి:

రూ.6వేల అప్పు తీర్చలేక ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.