ETV Bharat / jagte-raho

దారుణం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - Guntur District Latest News

22 ఏళ్ల మూడు ముళ్ల బంధాన్ని, ఇద్దరు పిల్లలను మరచి ఓ మహిళ దారుణానికి పాల్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడి సాయంతో భర్తను కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన గుంటూరులోని రాజీవ్ గాంధీనగర్​లో జరిగింది.

wife-murdered-her-husband
భర్తను హత్య చేసిన భార్య
author img

By

Published : Dec 8, 2020, 9:17 PM IST

గుంటూరులోని రాజీవ్ గాంధీనగర్​లో జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రియుడితో కలిసి భార్యే కట్టుకున్న భర్తను హత్య చేసిందని అరండల్​పేట సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

అసలేం జరిగింది

స్థానికంగా నివాసముంటున్న మరియదాసుకు, మరియమ్మతో 22ఏళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు మార్బుల్స్ పని చేస్తూ జీవనం సాగించేవారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా మరియమ్మ, తెనాలికి చెందిన అనిల్ అనే ఆటో డ్రైవర్​తో వివాహేతర సంబంధం సాగిస్తోంది. భార్య తీరుపై అనుమానం వచ్చిన మరియదాసు ఆమెను గట్టిగా మందలించాడు. దాంతో ఆమె ప్రియుడితో కలసి భర్తను చంపడానికి పథకం వేసింది. దానికి అనుగుణంగా ఇంట్లో నిద్రిస్తున్న మరియదాసు గొంతును తాడుతో బిగించి, రోకలి బండతో తలపై విచక్షణారహితంగా కొట్టి హతమార్చింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

రాజధాని ఉద్యమం..కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.