హైదరాబాద్ యువతి వెన్నులో తూటా ఉన్న కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేశారు. యువతి దేహంలో బుల్లెట్ ఉండటంపై రెండు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండేళ్లుగా యువతి శరీరంలో బుల్లెట్ ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలిపారు.
యువతి అస్మాబేగం కుటుంబ నేపథ్యం, స్థానిక పరిస్థితులపై విచారణ చేస్తున్నామన్నారు. బుల్లెట్ ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తూటాపై కుటుంబసభ్యుల అనుమానాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. బుల్లెట్ ఏ మోడల్ అన్న దానిపై ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బుల్లెట్‌పై పూర్తి వివరాల కోసం ఎఫ్ఎస్ఎల్‌కు పోలీసులు పంపించారు.
ప్రస్తుతం యువతి పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని చార్‌కమాన్ ప్రాంతంలో తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది.
ఇవీ చూడండి: కేసీ కాలువలో మహిళ మృతదేహం... ఎలా వచ్చింది?