విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని గజపతి నగరం తీరానికి ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానిక ఎస్సై దీనబంధు తెలిపారు. అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు.
మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. సముద్రంలో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నామన్న ఎస్సై... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: