అనంతపురం జిల్లా హిందూపురం గ్రామీణ మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చింతలపల్లిలో ఓ శుభకార్యానికి వెళ్లారు. అయితే ముగ్గురు చిన్నారులు బహిర్భూమి కోసం గ్రామ సమీపంలో నీటి గుంట వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు ముగ్గురూ నీటి గుంటలో పడ్డారు.
గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కృప, సాహితీ అనే చిన్నారులు మృతి చెందారు. మేరీ అనే మరో బాలిక ప్రాణాలతో బయట పడింది. కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు హిందూపురం రూరల్ ఎస్సై ఆజాద్ తెలిపారు.
ఇదీ చూడండి: