విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెల్లివాడ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసి బస్సును ఒడిషా నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మందికి గాయలయ్యాయి. వీరిలో బొండపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్‌తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మహారాజ జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాయపడిన వారికి సహాయక చర్యలు అందించేలా చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి