హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ధరంకరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి చంద్రశేఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అపార్టుమెంట్ సెల్లార్లోనే తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ భార్య ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుందని ...భార్య బంధువులు హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
మాట్లాడాలని పిలిచి...
ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పద్మశ్రీ అపార్టుమెంట్ వద్దకు వచ్చి చంద్రశేఖర్ ను మాట్లాడాలని పిలిపించి కత్తులతో దాడి చేసినట్లు ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: