హైదారాబాద్ జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అరుంధతినగర్లో 7 సంవత్సరాల బాలుడు నిఖిల్ గాలిపటం ఎగురవేస్తుండటంగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి తీవ్రగాయాల పాలయ్యాడు. పతంగి కరెంటు తీగలను చుట్టుకున్న ఆ క్రమంలో దానిని తీసే క్రమంలో షాక్ తగిలింది.
ఈ ప్రమాదంలో బాలుడి తల, మొహం, ఛాతి కాలిపోయింది. గమనించిన తల్లి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి రాజు 2 సంవత్సరాల క్రితం చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.