నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా హత్యలు చేస్తున్న సైకోను... హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రాములు 16 మందిని హత్య చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
2003 నుంచి వరుస నేరాలు
మెదక్, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో రాములుపై కేసులున్నాయని సీపీ వెల్లడించారు. నిందితుడు 2003 నుంచి వరుస నేరాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అన్ని ఘటనల్లోనూ మహిళలే బాధితులని చెప్పారు. మొదటి భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని వివరించారు. 2009లో జరిగిన వరుస హత్య కేసుల్లో రాములు అరెస్టు అయ్యాడని.. జీవిత ఖైదు పడినప్పటికీ హైకోర్టుకు వెళ్లి గతేడాది జులైలో విడుదలయ్యాడని అంజనీకుమార్ తెలిపారు.
ఆ కేసుతో వెలుగులోకి
రాములు... సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన భవన నిర్మాణ కూలీ. 15 రోజుల క్రితం అంకుశాపూర్ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది. ఈ కేసు దర్యాప్తులో సీరియల్ కిల్లర్ ఘాతుకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు హత్యలతో పాటు చోరీలకు కూడా పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇదీ చదవండి :
ఆ ఇద్దరూ విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు: ఎస్ఈసీ