ETV Bharat / jagte-raho

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం...ఆరుగురు దుర్మరణం - road accident at sangareddy district

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలం పాటి వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

road-accident-in-sangareddy-district-and-six-peoples-died

author img

By

Published : Nov 10, 2020, 6:59 AM IST

Updated : Nov 10, 2020, 7:45 AM IST

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం...ఆరుగురు దుర్మరణం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలం పాటి వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాహ్యవలయ రహదారిపై గుర్తుతెలియని వాహనం కారును ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటినా చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్​​ వాసులుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు.. ‌అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుల వివరాలు..

మృతులు ఝార్ఖండ్​ రాష్ట్రం రాంగఢ్‌ వాసులు కమలేశ్ లోహరే, హరి లోహరే, ప్రమోద్‌ భుహెర్, వినోద్‌ భుహెర్, గోరఖ్​పూర్​కు చెందిన పవన్‌ కుమార్, డ్రైవర్​ బంగ్లాదేశ్​కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు గోరఖ్‌పూర్​కు చెందిన ప్రమోద్‌ కుమార్, అర్జున్, ఆనంద్‌కుమార్, చంద్రవంశీగా గుర్తించారు.

ఇదీ చదవండి

స్టేటస్ కో ఉండగానే రైతు భరోసా కేంద్రం నిర్మిస్తారా..?: హైకోర్టు

Last Updated : Nov 10, 2020, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.