ETV Bharat / jagte-raho

వీడిన ఉత్కంఠ.. దొరికిన తల్లీకుమారుడి ఆచూకీ - నార్సింగి పోలీస్​ స్టేషన్​ పరిధిలో కిడ్నాప్​ కలకలం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ పరిధిలో అవహరణ గురైన తల్లీకుమారుడు ఆచూకీ లభ్యమైంది. వికారాబాద్​లో వారిని పోలీసులు గుర్తించారు. అపహరణపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వీడిన ఉత్కంఠ..  దొరికిన తల్లీకుమారుడి ఆచూకీ

author img

By

Published : Jul 9, 2020, 9:09 AM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్​ పరిధిలో కలకలం రేపిన తల్లి కుమారుడు అపహరణ ఘటన ఎట్టకేలకు తెరపడింది. వారు క్షేమంగా దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

బండ్లగూడలోని బైరాగిగూడకు చెందిన తల్లీకుమారులు ఆదిలక్ష్మి, మృదుల్‌, ప్రజ్వల్‌ కలిసి స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత పెద్ద కుమారుడు మృదుల్‌ పని ఉందంటూ తిరిగి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ప్రజ్వల్‌ తన సోదరుడికి ఫోన్​చేసి గుర్తుతెలియని వ్యక్తులు తనను, తల్లిని అపహరించారని తెలిపాడు.

ఆందోళన చెందిన మృదుల్​కు... బంధువులకు విషయం చెప్పాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. రంగంలోకి దిగిన పోలీసులు తల్లీకుమారుడిని వికారాబాద్​లో గుర్తించారు. వీరిని ఎవరు అవహరించారనే అంశంపై లోతుగా విచారిస్తున్నారు. అపహరణపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి: కరోనాను ఖతం చేసే యంత్రం ఆవిష్కరణ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.