ETV Bharat / jagte-raho

ప్రియుడే అల్లుడు... విషయం తెలిసి నవవధువు ఆత్మహత్య - క్యాటరింగ్

క్యాటరింగ్​తో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ యువకుడికి సొంత కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. తల్లితో భర్త సన్నిహితంగా ఉండటం చూసిన యువతి.. చాలా సార్లు హెచ్చరించింది. అయినా వారిలో మార్పు రాలేదు. మనస్తాపం చెందిన ఆ నవవధువు ఆత్మహత్య చేసుకుంది.

newly-married
newly-married
author img

By

Published : Mar 14, 2020, 2:46 PM IST

ప్రియుడే అల్లుడు... విషయం తెలిసి నవవధువు ఆత్మహత్య

హైదరాబాద్‌ బాలాపూర్‌లో నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు తల్లే కారణమంటూ లేఖ రాసింది. తల్లితో భర్త నవీన్ కుమార్​ వివాహేతర సంబంధం కొనసాగించడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో లభ్యమైన లేఖతో ఘటన వెనక గల కారణాలు వెల్లడయ్యాయి.

నవీన్ కుమార్​, యువతి తల్లి క్యాటరింగ్​ నిర్వహిస్తారు. తరచూ కలవడం వల్ల వారిరువురి మధ్య పరిచయం పెరిగింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సొంత కూతురినే ఆ యువకుడికిచ్చి నాలుగు నెలల క్రితం వివాహం చేసింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే భార్యతోపాటు వచ్చి నవీన్​ అత్తమామలతో ఉంటున్నాడు.

భర్త నవీన్‌కుమార్‌ తన తల్లితో సన్నిహితంగా ఉండటం చూసిన యువతి చాలాసార్లు హెచ్చరించింది. అయినా మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.