అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. ఓ పాడుబడిన ఇంట్లో ఇద్దరు ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన రవి (25) సుష్మిత (20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని స్థానికులు చెప్పారు.
పెద్దలు తమ వివాహానికి ఒప్పుకోరన్న భయంతోనే... వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: