హేమంత్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులు ఎరుకల కృష్ణ, మహమ్మద్ పాషా, రాజు, సాయన్నను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. హత్య తర్వాత మృతదేహంపై బంగారు నగలను కృష్ణ తీసుకెళ్లగా వాటిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రేమ వివాహం నచ్చకే హేమంత్‌ను చంపినట్లు లక్ష్మారెడ్డి అంగీకరించాడని డీసీపీ తెలిపారు. మిగతా ఏడుగురిని కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తామన్నారు. హత్య కేసులో అవంతి తమ్ముడు ఆశిశ్ పాత్ర లేదని ప్రాథమికంగా తేలినట్లు డీసీపీ పేర్కొన్నారు. హత్య కేసులో మరింతగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.
- ఇదీ చూడండి: రేపటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ