తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 10.40 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరం, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ దొంగతనాలు జరుగుతుండటంపై పోలీసులు నిఘా పెట్టారు.
కరీముల్లా, జయపాల్, ఖాజావలిని అరెస్ట్ చేశారు. అయిదు ఇళ్లల్లో వీరు చోరీకి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. 204 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వీరిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు.
ఇదీ చదవండి: