ETV Bharat / jagte-raho

57 కేసుల్లో నిందితుడు.. బైక్​ దొంగలిస్తుండగా అరెస్ట్​

అతడు 57 కేసుల్లో నిందితుడు. పోలీసులు పట్టుకోని చర్లపల్లి జైలుకు రిమాండ్​ నిమిత్తం తరలించారు. తర్వాత కరోనా సోకిందని ఆస్పత్రిలో చేర్చారు. అదే మంచి అవకాశంగా భావించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పారిపోయి బైక్​లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. దొంగలించిన వాహనంతో నిందితుడు దొరికిపోయాడు.

bowenpally
bowenpally
author img

By

Published : Oct 10, 2020, 8:00 PM IST

తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన సోమసుందర్ హైదరాబాద్​లో నివాసముంటున్నాడు. అయితే ఇతనిపై వివిధ స్టేషన్లలో 57 కేసులు నమోదయ్యాయి. ఎస్​ఆర్​ నగర్​ పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి.. రిమాండ్​లో భాగంగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఆగస్టులో సోమసుందర్​కు కరోనా సోకగా.. గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.

ఇదే మంచి అవకాశం అనుకొని నిందితుడు ఆస్పత్రి సెకండ్ ఫ్లోర్​ నుంచి పరారయ్యాడు. పారిపోయి ద్విచక్రవాహనాలు దొంగతనం చేయడం ప్రారంభించాడు. బాలానగర్​ పరిధిలో ద్విచక్రవాహనం పోయిందన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. అదే బైక్​పై బోయిన్​పల్లి వైపు వెళ్తుండగా పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని విచారించగా.. సోమసుందర్​పై నమోదైన​ కేసులు బయటపడ్డాయి. కొవిడ్​ చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పిస్తే.. పారిపోయి చోరీలకు పాల్పడ్డాడని బాలానగర్​ ఇన్​స్పెక్టర్​ వహీదుద్దీన్​ తెలిపారు.

ఇదీ చదవండి:

ఈ దొంగపై మహరాష్ట్రలో 47 గొలుసు దొంగతనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.