పోలీసుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయికి బానిసైన ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఐదుగురు వ్యక్తులు పోలీసులమని బెదిరించారు. మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ నగదు తీసుకునేందుకు బందరు రోడ్‌లోని ఓ బ్యాంక్ ఏటీఎం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులను నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఐదుగురు నిందితుల్లో ముగ్గురు చిట్టినగర్‌కు చెందిన యువకులున్నారని పోలీసులు గుర్తించారు. వారిలో ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్లు ఉన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. బాధితుడు గంజాయి సేవిస్తూ...గంజాయి విక్రయాలు జరుపుతాడని ..దీన్ని ఆసరాగా చేసుకుని పోలీసుల పేరుతో నగదు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల్లో ఏఆర్ ఎస్సై కుమారుడు ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. దీనిపై సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి