హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఎన్టీఆర్ మార్గ్ వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. క్షతగాత్రులను సైఫాబాద్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
రహదారికి మధ్యలో కారు ఉండటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించారు.
- ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 5,653 కరోనా కేసులు నమోదు