తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామం వద్ద కామారెడ్డి రూరర్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్ రెడ్డి బృందం వాహనాల తనిఖీలు నిర్వహించారు. అటుగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు భయపడి పారిపోవడం గమనించిన పోలీసులు.. అనుమానం వచ్చి వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా గుళ్లలో దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు భూక్య మంగ్యా, భూక్య గణేష్, రాజుగా గుర్తించారు. కేటుగాళ్లను పట్టుకోవడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర పోషించాయని ఎస్పీ శ్వేత తెలిపారు. దొంగతనం చేసిన వారి వద్ద నుంచి 1,16,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన ఒక కానిస్టేబుల్, హోంగార్డులకు నగదు బహుమతిని అందించారు.
ఇదీ చూడండి: చల్లని గాలి..పరుపులపై నిద్ర..ఆ గోవు రూటే సపరేటు!