విశాఖలో వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు క్రైం డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు. మిథిలాపురి కాలనీ లే అవుట్లో ఇటీవల ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించిన ఒడిశాకు చెందిన లక్ష్మణ్ బారిక్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. కంచరపాలెం పైడిమాంబ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడిన కేసులో కళ్యాణ్ కిషోర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
మర్రిపాలెం జ్యోతి నగర్లో భారీగా నిల్వ చేసిన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఐదున్నర లక్షల రూపాయలు విలువ చేసే 80 వేల గుట్కా ప్యాకెట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు గాజువాకలో లక్ష రూపాయల మేర విలువ చేసే 10 వేల గుట్కా ప్యాకెట్లను కారులో తరలిస్తుండగా స్థానిక క్రైమ్ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు జరిపి వాటిని పట్టుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన పోలీసులు అరెస్టు చేసిన నిందితులు అందరినీ రిమాండ్కు తరలించామని డీసీపీ సురేష్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: