ఆదోనికి చెందిన శేఖర్ అనంతపురంలోని బంధువుల ఇంటికి పచ్చాడు. అయితే రైలు ఢీకొని మృతి చెందాడు. పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. వ్యాపారం నిమిత్తం కర్నూలు జిల్లా ఆదోనిలో స్థిరపడ్డాడని.. లాక్డౌన్ కారణంగా వ్యాపారం సాగక మనస్థాపం చెందిన శేఖర్.. మద్యానికి బానిస అయ్యాడని మృతుని బంధువులు తెలిపారు. తరచూ ఇంట్లో గొడవ పడేవాడని... మద్యం మత్తులోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం