ETV Bharat / jagte-raho

నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి! - suicide news in chittoor district

ఇద్దరు చిన్నారులు నీటిలో పడి మృతి చెందగా.. తల్లి అపస్మారక స్థితిలో పడి ఉన్న ఘటన చిత్తూరు జిల్లాలోని చింతపర్తివారిపల్లి సమీపంలో కలకలం సృష్టించింది. ఆ చిన్నారుల తల్లితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడే పడి ఉండడంపై.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నీటిపై చిన్నారుల మృతదేహాలు
నీటిపై చిన్నారుల మృతదేహాలు
author img

By

Published : Sep 15, 2020, 9:18 AM IST

Updated : Sep 15, 2020, 9:31 AM IST

నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!

చిత్తూరు జిల్లా సదుం మండలం చింతపర్తి వారి పల్లెలో చిన్నారుల మృతి.. కలకలం సృష్టిస్తోంది. గ్రామంలోని నడిమోడుకుంట చెరువులో ఇద్దరు కవల పిల్లలు మృతదేహాలుగా తేలారు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా... మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారులను ఎవరు చెరువులో పడేసి ఉంటారు అన్న కోణంలో తనిఖీలు చేస్తుండగా... పక్కనే పొదల్లో అపస్మారక స్థితిలో ఉన్న ఓ జంటను పోలీసులు గుర్తించారు.

మహిళ పూర్తిగా అపస్మారక స్థితిలో ఉండగా... ఆమె పక్కనే కాస్త స్పృహలో ఉన్న వ్యక్తి ఉదయ్ కుమార్ నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. ఆ మహిళను పులిచెర్ల మండలం ఈ రామిరెడ్డి పల్లి పంచాయతీకి చెందిన హేమశ్రీగా గుర్తించారు. చెరువులో పడి చనిపోయిన ఇద్దరు పిల్లలను పునీత్, పునర్వి.. ఆమె సంతానంగా నిర్ధారించారు. పిల్లల తండ్రి వెంకటేశ్వర రెడ్డికి ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. ఈ ఘటనకు గల కారణాలు.. పసి పిల్లలను చెరువులో పడేసి చంపేయడానికి దారి తీసిన పరిస్థితులపై.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చీకటైపోయిన జీవితాలు

Last Updated : Sep 15, 2020, 9:31 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.