గుంటూరు జిల్లా చిలుకలూరిపేట తాగునీటి చెరువు సమీపంలో విషాదం జరిగింది. సాయంత్రం విద్యుత్ స్తంభంపై పనులు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై సాగర్(22) అనే యువకుడు మృతి చెందాడు. అధికారులు, పనులు నిర్వహిస్తున్న సబ్ కాంట్రాక్టర్కు మధ్య విద్యుత్ ఎల్సీ(లైన్ క్లియల్) విషయంలో అవగాహనలోపంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న చిలుకలూరిపేట గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుటుంబసభ్యుల ఆందోళన...
సాగర్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని విద్యుత్ స్తంభంపైనే ఉంచాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన చిలుకలూరిపేట గ్రామీణ ఎస్ఐ భాస్కర్... న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పటంతో మృతదేహాన్ని కిందికి దించారు.
ఇదీ చదవండి