మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులకు వివిధ కేసుల్లో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2017లో తెలంగాణలోని లాలాగూడ పీఎస్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి ట్యూషన్‌కి వెళ్తుండగా ప్రభాకర్ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది.
మరో కేసులో 2018లో యూసఫ్గుడలో నాలుగేళ్ల చిన్నారి దుకాణానికి వెళ్లి వస్తుండగా నిందితుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నాంపల్లి పోక్సో కోర్టు నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 12 వేల రూపాయల ఫైన్ విధించింది.
ఇదీ చూడండి :