
"మేము నేషనల్ ఎమర్జెన్సీ విధించాలని చూస్తున్నాం. ఎందుకంటే అనుకూలంగా ఏదైనా జరగతుందని నేను అనుకోవట్లేదు. డెమోక్రాట్లకు సరిహద్దు రక్షణ అవసరం లేదనుకుంటున్నా. గోడలు అనైతికమైనవి, పని చేయవని వారు మాట్లాడటం విన్నాను. కానీ అవి పనిచేస్తాయని వారికి తెలుసు. గోడ నిర్మాణానికి మంచి అవకాశం ఉందని అనుకుంటున్నా."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి చెడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. సరిహద్దులో భద్రతా పెంచాల్సిన అవసరం ఉందని ఆమెకు తెలిసినా ఆ విషయం పట్టించుకోవట్లేదన్నారు. అక్రమ వలసదారులపై ఎవరికీ పట్టింపులేదని, మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించి తీరుతామన్నారు. దానివల్లే అక్రమ వలసదారులు దేశంలోకి రాకుండా ఆపగలమని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సరిహద్దు రక్షణకు 2500 మంది పోలీసులను పంపినట్లు తెలిపారు. వారి సేవలను ప్రశంసించారు.