ETV Bharat / headlines

కెరీర్ అత్యుత్తమ ఏటీపీ ర్యాంకుకు ప్రజ్నేశ్

పదేళ్లలో ఏటీపీ పరుషుల సింగిల్స్​ ర్యాంకింగ్స్​ టాప్-100లో చోటు దక్కించుకున్న మూడో భారత ఆటగాడిగా ప్రజ్నేశ్ రికార్డు సాధించాడు.

ప్రజ్నేశ్
author img

By

Published : Feb 11, 2019, 11:14 PM IST

ఏటీపీ పురుషుల సింగిల్స్​లో భారత ఆటగాడు ప్రజ్నేశ్​ గుణేశ్వరణ్​ అరుదైన ఘనత సాధించాడు. నిలకడైన ఆటతీరుతో ఏటీపీ టెన్నిస్​ ర్యాంకింగ్స్​లో ​97వ స్థానానికి చేరాడు. దీంతో పురుషుల సింగిల్స్​ గ్రాండ్​స్లామ్​ మెయిన్​ డ్రాకు ఎంపికయ్యాడు.
గత వారం ఏటీపీ చెన్నై ఛాలెంజర్​లో సెమీఫైనల్​కు చేరిన ప్రజ్నేశ్.. 2018లోనూ మెరుగైన ప్రదర్శన చేసి ఈ ఘనత అందుకున్నాడు. గత పదేళ్లలో సోమదేవ్ వర్మన్, యూకీ బాంబ్రీ తర్వాత ఈ ఫీట్ అందుకున్న మూడో భారత ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ఇంతకు ముందు టాప్-100లో చోటు దక్కించుకున్న యూకీ బాంబ్రీ తరచూ గాయాలపాలవుతూ ఈ సారి 128 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. రామ్​కుమార్ రామనాథన్ 156వ స్థానంలో ఉన్నారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న 37వ ర్యాంకుతో ముందున్నాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.