YOUTH TRAPPED BY BROKERS: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలలాకు చెందిన 8మంది యువకులు.. ఒమన్‌లో చిక్కుకుపోయారు. కల్గి నాయుడు, వాసెట్టి రవికుమార్, గుణ్ణా గోపాల్, సీలా వాసుదేవ్, తామాడ కృష్ణరావు, కీలు మాణిక్యరావు, కర్ని లోకనాథం, తలగాన నీలకంఠం అనే వ్యక్తులు.. ఈ ఏడాది మే నెలలో విశాఖలోని కార్తికేయ ఇనిస్టిట్యూట్ ద్వారా ఉపాధి నిమిత్తం వీరు ఒమన్ దేశం వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులు ఉంటాయని దళారులు చెప్పడంతో సొమ్ము చెల్లించి ఇక్కడకు వచ్చామన్నారు.
అయితే సంబంధిత దళారులు చెప్పిన కంపెనీ అక్కడ లేదని, ఒంటెలకు కాపలాదారుగా వదిలివేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఉపాధి, తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్టు , వీసాలు నకిలీ పోలీసులు తీసుకోవడంతో భారత రాయబార కార్యాలయానికి సంప్రదించే అవకాశం లేదని బాధితులు తెలిపారు. తమను కాపాడి స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్‌తో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌కు వీడియోలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: