తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. స్థానిక కింగ్స్ కాలనీలో ఉండే నదీమ్ ఖాన్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇటీవల నదీమ్‌ఖాన్‌కు ఓ అమ్మాయితో నిశ్చితార్థం కాగా... ఆ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తే నదీమ్‌ను అపహరించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళ నదీమ్ ఖాన్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆపి.. ఇద్దరు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: