కుటుంబ సమస్యలతో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిన నవ వధువు తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కడప జిల్లా పుల్లంపేటకు చెందిన యువతికి ఇటీవలే వివాహమైంది. పెళ్లైన రోజు నుంచే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా సమస్యలు ఎక్కువ కావడంతో మంగళవారం విషపు గుళికలు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు యువతిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పుల్లంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: