Wife Suicide: రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోయయాని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఏదో కారణం చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో తొందరపాటుగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా తొందరపాటు నిర్ణయంతో భర్త తాను చెప్పిన మతం తీసుకోలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుందని ఎస్సై చావా సురేష్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన పావని(31)కి, మిరియాల ఈశ్వర అనిల్‌కుమార్‌కు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. అనిల్ కుమార్ భీమడోలులో ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. పెళ్లికి ముందు నుంచి తన తల్లిదండ్రులతో కలిసి ప్రార్థన మందిరానికి వెళ్లే పావని.. భర్తను కూడా ఆ మతం తీసుకోమని కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది. భర్త అందుకు విముఖత చూపిస్తున్నారు. ఇటీవల అతని చరవాణిలో ముఖచిత్రంగా ఆ మతానికి చెందిన దేవుని ఫొటోను ఆమె పెట్టగా.. అతను దాన్ని తొలగించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఆగస్టు 29వ తేదీ రాత్రి వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు భర్త పని నిమిత్తం బయటకు వెళ్లి.. రాత్రి తిరిగి ఇంటికి రాగా తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానంతో పరిశీలించగా భార్య పావని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మృతురాలు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై అనుమానాస్పదస్థితి మృతి కేసుగా నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి: