ETV Bharat / crime

కోనసీమలో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి

DIED WITH ELECTRIC SHOCK: వారిద్దరూ జీవనోపాధి కోసం ఊరు కాని ఊరొచ్చారు. భవన నిర్మాణ పనులు చేస్తూ.. విద్యుత్​షాక్​కు గురై.. ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన అంబేడ్కర్​ కోనసీమ జిల్లాలో జరిగింది.

ELECTRIC SHOCK
ELECTRIC SHOCK
author img

By

Published : Sep 2, 2022, 6:09 PM IST

ELECTRIC SHOCK IN KONASEEMA : అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఒక అపార్ట్​మెంట్​లో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుత్ షాక్​కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపటపల్లికి చెందిన గుడ్డు వెంకట రమణ(35), టి.కే రాజాపురానికి చెందిన గుడబా అర్లెప్ప(50).. రావులపాలెంలోని సీఆర్​సీ రోడ్​లో నూతనంగా నిర్మిస్తున్న వసంత విహార్ అపార్ట్​మెంట్​లో తాపీ పని చేసేందుకు వచ్చారు. భవనంలో సిమెంట్​ కప్​ బోర్డుల నిర్మాణంలో భాగంగా.. వాటిని కటింగ్ మిషన్​తో కట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్​కు గురయ్యారు.

వెంకట రమణ ప్లగ్ స్పిచ్ఛాన్​ చేయగానే వైరు కట్ అయిన చోట చూసుకోకుండా అర్లెప్ప పట్టుకున్నాడు. అది చూసిన వెంకటరమణ స్విచ్ఛాఫ్ చేయకుండా వచ్చి అతన్ని పట్టుకోవడంతో అతను కూడా షాక్​కు గురయ్యాడు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంటి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.