ETV Bharat / crime

చంద్రబాబు కందుకూరు సభలో విషాదం.. 8మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాబు

Chandrababu Visit to Kandukur: నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. బహిరంగ సభ వద్ద తొక్కిసలాట జరగ్గా.. ఇద్దరు మహిళలు సహా 8మంది మృతి చెందారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు..బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు..

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Dec 29, 2022, 6:48 AM IST

Updated : Dec 29, 2022, 9:11 AM IST

Chandrababu Visit to Kandukur: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కందుకూరు బహిరంగ సభకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో.. తోపులాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చంద్రబాబు బుధవారం రాత్రి 7:30 గంటలకు చేరుకున్నారు. అప్పటికే భారీగా జనం రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. చంద్రబాబు వాహనం వెంట కూడా జనం పెద్దఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో అక్కడున్న ద్విచక్రవాహ నాలపై కొందరు పడిపోగా.. వారిపై మరికొందరు పడ్డారు. అప్రమత్తమైన టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.

చంద్రబాబు ప్రసంగం ప్రారంభం నుంచి కార్యకర్తలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రమాదకరంగా ఫ్లెక్సీలపై ఎక్కిన వారిని ఆయన మందలించారు. సభ విజయవంతంగా నిర్వహించుకునేందుకు సహకరించాలని కోరారు. పోలీసులు సహకరించి కార్యకర్తలను నియంత్రించాలని కోరారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిన విషయాన్ని గుర్తించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి తెలుసుకునే వరకు సభను నిలిపివేశారు. వెంటనే బాధితుల్ని తరలించిన ఆసుపత్రికి వెళ్లారు.

ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబుకు వైద్యులు పలువురు మృతి చెందారని చెప్పడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశ్రునయనాలతో బాధితులకు నివాళి అర్పించారు. అనంతరం ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వస్తే అనుకోకుండా ఈ అవాంఛనీయ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు . బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు..2 నిమిషాలపాటు మౌనం పాటించారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేడు కావలి,రేపు కోవూరులో చంద్రబాబు పర్యటన జరగాల్సి ఉండగా..ముఖ్య నేతలతో అంతర్గత ముఖ్య సమావేశం అనంతరం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు..

చంద్రబాబు కందుకూరు సభలో విషాదం.. 8మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాబు

ఇవీ చదవండి:

Last Updated : Dec 29, 2022, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.