ETV Bharat / crime

Today Crime News: రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రమాదాలు.. తిరుపతిలో విద్యార్థుల ఆత్మహత్య - ఏపీ లేటెస్ట్ క్రైమ్​ న్యూస్​

Today Crime News: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ మహిళ, ఓ చేనేత కార్మికుడు హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లాలో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Crime News
ఏపీ నేర వార్తలు
author img

By

Published : Mar 26, 2022, 12:20 PM IST

Updated : Mar 26, 2022, 10:06 PM IST

Today Crime News: ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ రెండు ఆత్మహత్యలు తిరుపతిలోనే జరగడం.. ఈ ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారమే కారణం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హాస్టల్​లో ఉంటూ చదువుకుంటూ.. ఎంతో బంగారు భవిష్యత్​ ఉన్న యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడటంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఒకరు.. ఉరేసుకుని మరొకరు: చిత్తూరు జిల్లా తిరుపతిలోని బీసీ బాలుర వసతిగృహంలో హాస్టల్‌ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సహచర విద్యార్థులు తెలిపారు. మృతుడు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగానిపల్లెకు చెందిన నాగేంద్రకుమార్‌గా పోలీసులు గుర్తించారు.

తిరుపతి పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల వసతిగృహంలో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. హాస్టల్‌లో ప్రేమ లేఖలు, ప్రియుడు పంపిన బహుమతులు స్వాధీనం చేసుకున్నారు.

కూరగాయలకు డబ్బులివ్వలేదని.. : అనంతపురం జిల్లా ధర్మవరం శివనగర్​లో భార్య నాగరత్నమ్మపై.. భర్త లక్ష్మణ స్వామి కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు తీసుకురావాలని భర్తకు చెప్పగా.. డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో ఆగ్రహించిన భర్త.. ఇంట్లో కొడవలితో దాడి చేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పరారయ్యాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. లక్ష్మణస్వామి కోసం గాలిస్తున్నారు. నాగరత్నమ్మకు ప్రథమ చికిత్స చేసి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మహిళ దారుణ హత్య: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడులో మహిళ హత్యకు గురైంది. రమణమ్మను హత్యచేసి దుక్కిచేసిన వరిమడిలో మృతదేహం పూడ్చినట్లు స్థానికులు తెలిపారు. రమణమ్మ సోదరుడు బోయకొండ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా వైకాపా నేత వెంకటరమణారెడ్డి, రమణమ్మ మధ్య స్థల వివాదం జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి స్థలం వివాదంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చేనేత కార్మికుడి దారుణ హత్య: చిత్తూరులో మదనపల్లె నీరుగట్టువారిపల్లిలో చేనేత కార్మికుడు హత్యకు గురయ్యాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రం అరణి ప్రాంతానికి చెందిన కదిరేషన్‌(50)గా పోలీసులు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చి స్థిరడినట్లు పోలీసులు తెలిపారు.

పూజారి హత్యకేసులో ఐదుగురు అరెస్ట్​: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో పూజారి హత్యకేసులో పోలీసులు... ఐదుగురిని అరెస్టు చేశారు. ఈనెల 21న తాడిమళ్లలోని ఆలయ ఆవరణలో పూజారి నాగేశ్వరశర్మ హత్యకు గురైన విషయం తెలిసిందే. కుటుంబసభ్యుల మధ్య ఆస్తి తగాదాలే హత్యకు కారణమని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

లారీ బోల్తా... క్యాబిన్​లో చిక్కుకున్న డ్రైవర్​: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం డుమంగి వద్ద ఒడిశా నుంచి ఆంధ్రా వైపు వస్తున్న లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్​ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు.

బొలెరో-కారు ఢీ... నలుగురికి తీవ్రగాయాలు: ప్రకాశం జిల్లా ఒంగోలు-నంద్యాల రహదారిలో మధ్య తర్లుపాడు మండలం రోలుగుంపాడు గ్రామం వద్ద టమాటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కాళ్లు విరిగిపోయాయు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

దర్శి పోలీస్​స్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం: ప్రకాశం జిల్లా దర్శి పోలీస్​స్టేషన్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దర్శి మండలం దేవవరం గ్రామానికి చెందిన వ్యక్తిపై తానాంచింతలకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ కేసులో విచారణ నిమిత్తం 24వ తేదీన పోలీసులు పోలీస్​ స్టేషన్​కు పిలిచారు. ఆరోజు దర్శిలో తిరునాళ్లు జరుగుతుండటంతో అతనిని స్టేషన్​లోనే ఉంచారు. శుక్రవారం కూడా విచారణ నిమిత్తం అతనిని స్టేషన్​పై అంతస్తులో ఉంచారు. అది అవమానంగా భావించిన అతడు... తన కండువాతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్​ అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.

కడప జిల్లా హత్య కేసును చేధించిన పోలీసులు: కొన్ని రోజుల క్రితం రాయచోటి- సుండుపల్లి మార్గంలోని అడవిలో మహిళ హత్య కేసును రాయచోటి పోలీసులు చేధించారు. మృతురాలు రాయచోటికి చెందిన కళావతి(50)గా గుర్తించారు. రామాపురం మండలం హసనాపురంకు చెందిన పూదోట గురవయ్య.. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కాజేసేందుకు అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు విచారణలో తెలిందని డిఎస్పీ శ్రీధర్​ తెలిపారు. ఈనెల 11న పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. తక్కువ కాలంలో కేసును చేధించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

కత్తితో దాడి: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలంగొల్లగూడెంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు... పాత గొడవల నేపథ్యంలో పటాపంచల గోపాలరావుపై అదే గ్రామానికి చెందిన డోల రమేశ్​ కత్తితో దాడి చేయగా.. కుడిచేతికి గాయమైంది. అనంతరం రమేశ్​ అక్కడినుంచి పారిపోయాడు. గోపాలరావు..విజయవాడలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిగిపల్లి ఎస్సై చంటి తెలిపారు.

సాధువుల నుంచి గంజాయి స్వాధీనం: కడప రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్​లో ఇద్దరు సాధువుల నుంచి రూ.2 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకొని విచారించగా.. విశాఖపట్నం నుంచి వివిధ మార్గాల్లో గంజాయి తీసుకొస్తున్నట్లు తెలిపారు. సాధువులు సుబ్బరాయుడు, నాగేశ్​.. కడప జిల్లాలోని ఓ ఆశ్రమానికి వెళ్లి సమీప ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు సమాచారం.

కరెంట్​ తీగలు తగిలి..: విశాఖ గోపాలపట్నంలో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేస్త్రీలు సత్యం, ఎర్రి నాయుడు.. ఇంటిపై గోడ నిమిత్తం పనిచేస్తుండగా.. పైన ఉన్న కరెంట్​ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. స్థానికుల సాయంలో ఇరువురని కేజీహెచ్​కు తరలించారు.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: మద్దిరాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట- కోటప్పకొండ మార్గంలోని మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడగా వారిని 108 అంబులెన్స్​లో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు గోపాలంవారిపాలెం గ్రామానికి చెందిన యర్రసాని మరియ దాసుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Last Updated : Mar 26, 2022, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.