ETV Bharat / crime

AP Crime News: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

Crime News: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బాపట్ల జిల్లాలో రోడ్డు దాటుతున్న పాదచారులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా కోలగట్ల వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.

AP Crime News: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

author img

By

Published : Apr 24, 2022, 1:09 PM IST

Updated : Apr 24, 2022, 10:55 PM IST

Crime News: నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముఠాను కడప పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా...నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కడపకు చెందిన సుధాలక్ష్మి వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సుధాలక్ష్మి పేరిట నకిలీ పత్రాలు, ఆధార్ కార్డు, సృష్టించి ఆ స్థలాన్ని కాజేశారు. వారం క్రితం కడపకు వచ్చిన సుధాలక్ష్మి స్థలం కబ్జా అయినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు కేసు నమోదు చేసిన పోలీసులు పది మందిని అరెస్టు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎవరు చేశారో తెలియదు కానీ.. పురిటిలోనే కన్న బిడ్డను కాదనుకున్నారు. కనీసం కళ్లు కూడా తెరవని పసికందు అమ్మ పొత్తిళ్లకు దూరమైంది. అప్పుడే పుట్టిన బొడ్డుకూడా కోయని మగ శిశువును ఓ బ్యాగులో పెట్టి రైలు పట్టాల పక్కన వదిలి వెళ్లారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తవలసలో రైలు పట్టాలు పక్కన ఒక బ్యాగు ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి శిశువును విజయనగరం ఆస్పత్రికి తరలించారు.

శ్రీ సత్యసాయి జిల్లా: నల్లచెరువు మండలం అల్లుగుండులో ఘోరం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త కత్తితో పొడిచి పరారయ్యాడు. కదిరి డీఎస్పీ భవ్యకిషోర్, ఎస్ఐ వరలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా: ఇరగవరం మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సిబ్బంది దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 700 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.

పల్నాడు జిల్లా: దాచేపల్లి పట్టణంలోని అద్దంకీ- నార్కెట్​పల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని జగన్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలోబస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. 20మందికి తీవ్రగాయాలయ్యాయి. జగన్ ట్రావెల్స్ బస్సు నాగాలాండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉంది.

*వినుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. హనుమాన్‌నగర్‌లో 20 మందిని గాయపర్చింది. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స జరుగుతోంది.

అనంతపురం జిల్లా: గుంతకల్లులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బియ్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. లారీని సీజ్‌ చేసి, సుమారు 20టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం తలార్లపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

బాపట్ల జిల్లా: మార్టూరు మండలం జొన్నతాలి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న పాదచారులను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిడంతో
ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.

తిరుపతి జిల్లా: బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న బావిలో ఈతకు వెళ్లిన విద్యార్థి వినయ్‌(14) నేడు శవమై తేలాడు.

కృష్ణా జిల్లా: బాపులపాడు మండలం పేరికీడు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మినీ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. దీంతో.. వ్యాను పూర్తిగా దగ్ధమయ్యింది. గుంటూరుకు చెందిన కన్నెబోయిన మహేష్ తన సొంతమైన మినీ వ్యాన్ లో 15 మంది యాత్రికులతో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దర్శనార్ధం వచ్చారు. అమ్మవారి దర్శనానంతరం తిరిగి గుంటూరు వెళ్తుండగా.. నందిగామ వద్దకు రాగానే వ్యాన్ లో షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపడంతో.. అందులోని వారంతా కిందకు దిగిపోయారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. వేగంగా మంటలు వ్యాపించడంతో.. వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నందిగామ ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

* తిరువూరులో ఓ బాలికను వాలంటీరు భర్త వేధిస్తున్నాడని పీఎస్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వాలంటీరు భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ : ఓ వివాహిత కత్తితో హల్చల్ చేసిన సంఘటన విశాఖలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వివాహితకు గతంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ నేపథ్యంలోనే.. ఆమెకు కొంత నగదు ఇచ్చి సర్దుబాటు చేసుకున్నారు. అయితే.. సదరు మహిళ మళ్లీ డబ్బులు కావాలని ఆ వ్యక్తి ఇంటివద్దకు వచ్చి గొడవ చేసింది. కత్తితో తనను తాను స్వల్పంగా గాయపరుచుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను సముదాయించి, ఆసుపత్రిలో చేర్పించారు. మళ్ళీ ఆ వివాహిత తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పోలీసులు తిరిగి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ: నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.

విశాఖలో ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్​: విశాఖ కొమ్మాది జంక్షన్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షరీఫ్, సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న సెబ్ అధికారులు.. వారి నుంచి బ్యాంకు పాస్‌బుక్స్‌, ఏటీఎం కార్డులు, ఫోన్లు స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: Thieves: విలాసాలకు అలవాటు పడి.. నగలు తస్కరించి

Last Updated : Apr 24, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.