ETV Bharat / crime

AP Crime News: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాలు.. పదమూడు మంది మృతి

author img

By

Published : Apr 18, 2022, 11:43 AM IST

Updated : Apr 19, 2022, 4:41 AM IST

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 13 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

AP Crime News
రాష్ట్రంలో పలు ప్రమాదాలు

AP Crime News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని 65వ నెంబర్​ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు డివైడర్​ను దాటుకుని ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన అక్షిత వల్లి(52) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. గాయపడినవారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి.. ఒకరు మృతి: కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేయగా పారిపోయే క్రమంలో బేతపూడికి చెందిన బి.వెంగళరెడ్డి(48) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన బాపట్లజిల్లా చీరాల మండలం గవినివారిపాలెం సమీపంలో జరిగింది. పోలీసులు దాడిచేయటంతోనే వెంగళరెడ్డి మృతి చెందాడని చీరాల ఏరియా ఆసుపత్రి ముందు మృతుని బంధువులు ఆందోళనకు దిగారు

మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగుల మండలం బోయితలి, మద్దిగరువు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అల్లూరి ఆదివాసి యువజన సంఘం పేరిట పోస్టర్లు అతికించారు. గిరిజన ద్రోహులు.. మావోయిస్టులు, గిరిజన హంతకులు.. మావోయిస్టులు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.

236 కిలోల గంజాయి స్వాధీనం: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 236 కిలోల గంజాయిని ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులను చూసి గంజాయి స్మగ్లర్‌ పరారయ్యారు.

భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్: అల్లూరి సీతారామరాజు జిల్లా డొంకరాయిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 160 కిలోల గంజాయి స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన 2 ఆటోలను సీజ్‌ చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.

ఐఫోన్‌ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి: కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న దుకాణంలో చోరీ జరిగింది. మజ్జిగ ప్యాకెట్‌ కొనుగోలుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఐఫోన్‌ దొంగిలించాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

భూ వివాదం పరిష్కారం కాలేదని..: గుంటూరు గ్రామీణ మండలం జొన్నలగడ్డలో ఇక్కుర్తి ఆంజనేయులు అనే రైతు ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదం పరిష్కారం కాలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక కౌలురైతు రామకృష్ణ(39) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు.

ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి వద్ద బస్సు స్టీరింగ్‌ ఫెయిల్‌ కావడంతో పాఠశాల బస్సు బోల్తా పడింది. ఆ ప్రైవేటు పాఠశాల బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను కాపాడారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.

లారీ, కారు ఢీ.. ఇద్దరు మృతి: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వద్ద ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

యురేనియం కర్మాగారం ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి: పులివెందుల బాకరాపురంలో తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం ఉద్యోగి శంకర్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడు ఉరి వేసుకున్న తీరు అనుమానాస్పదంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్: కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దుర్గా అనే యువతి తన ప్రేమ వివాహాన్ని పెద్దలు ఒప్పుకోలేదని కాకినాడలోని ఆర్అండ్​బీ సూపరిడెంట్ కార్యాలయం పైకి ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కలెక్టర్ ఆఫీస్ పోలీసు ఔట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ అనే హెడ్ కానిస్టేబుల్ చాకచక్యంతో వ్యవహరించి అమ్మాయిని కాపాడాడు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య: అప్పులు బాధలు తట్టుకోలేక వెంకటేశ్వర్లు ( 38 ) అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై బాలనాగిరెడ్డి తెలిపారు.

రెండు కేజీల గంజాయి స్వాధీనం: విశాఖ జిల్లా ఆనందపురం మండలం దుక్కవాని పాలెం టోల్ ఫ్లాజా సమీపంలో మినీవ్యాన్​లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు కేజీలు బరువు గల 82 గంజాయి ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆనందపురం పోలీసులు తెలిపారు.

సారా బట్టిలపై ఎస్ఈబి పోలీసుల దాడులు: రెడ్డిగూడెం, ఏ కొండూరు, గంపగూడెం మండలాల్లో సారాయి బట్టిలపై ఎస్ఈబి పోలీసుల మెరుపు దాడులు చేశారు. 97 లీటర్ల సారా, 8,300 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి, ఐదుగురి వ్యక్తులను అరెస్టుచేశారు.

పిడుగుపడి వ్యక్తి మృతి: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాళ్ల పల్లె గ్రామంలో పిడుగుపడి రాజు (25) అనే వ్యక్తి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని గిద్దలూరు మండలం కె.ఎస్ పల్లె గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం: కృష్ణాజిల్లా గుడివాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెప్తున్నారు.

పేపర్ ప్లేట్స్ తయారీ కుటీర పరిశ్రమ దగ్ధం: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కె.కొత్తూరులో పేపర్ ప్లేట్స్ తయారీ కుటీర పరిశ్రమ అగ్నికి ఆహుతైంది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సుమారు నాలుగు లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ట్రాక్టర్ టైర్ పేలడంతో వ్యక్తి మృతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతర్ కోట జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్ టైర్ పేలడంతో అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఏటీఎంలో దొంగ: అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న ఏటీఎంలో దొంగలు పడ్డారు. రాత్రి ఎవరూ లేని సమయంలో దొంగ ఏటీఎంలోకి చొరబడి నట్లు సీసీ కెమెరాలో నమోదైంది. నగదు ఏమీ పోలేదని బ్యాంకు అధికారులు, పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడి కోసం సీసీ టీవీ ఫుటేజ్​ను పరిశీలిస్తున్నారు.

కొప్పోలు గ్రామానికి వచ్చిన కార్తిక్ పార్థివ దేహం: ఇటీవల అమెరికాలో అనారోగ్యంతో మృతిచెందిన ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన దొండపాటి కార్తిక్ పార్థివ దేహాన్ని ఆదివారం నాడు కొప్పోలుకి తీసుకొచ్చారు. కార్తిక్ పార్థివ దేహానికి తెదేపా రాష్ర్ట ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ నివాళులర్పించారు.

అనుమాన స్పదంగా విద్యార్థి మృతి: గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం డోకిపర్రు పరిధిలోని బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రయ్య అనే విద్యార్థి కళాశాల సమీపంలోని రైలు పట్టాలపై మృతిచెందాడు. విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో అదుపుతప్పిన కారు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ప్రమాదం తప్పింది. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో అదుపుతప్పిన కారు.. పక్కనే వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు: బాపట్ల జిల్లా వేటపాలెం స్టేషన్‌లో చెన్నై నుంచి విజయవాడ వెళ్లే గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఎండ్ల బండిని ఢీకొట్టి... లారీ కిందపడి వ్యక్తి మృతి: కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రు వద్ద మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారుడు ముందు వెళ్తున్న ఎడ్లబండిని ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న వ్యకి రోడ్డుపై పడిపోయాడు. ఇంతో ఆ వ్యక్తిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు మచిలీపట్నం చెందిన తాత అజయ్​గా పోలీసులు గుర్తించారు. మచిలీపట్నంలో ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పరిటాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కారును ఢీకొన్న ఆటో... 10 మందికి గాయాలు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై కాలీలతో వెళ్తున్న ఆటో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులనుఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అప్పుల బాధ తాళలేక... కౌలు రైతు ఆత్మహత్య: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామానికి చెందిన మేడపోయిన రామకృష్ణ (39)అనే కౌలు రైతు అప్పులు తీర్చలేక పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో తల్లి బిడ్డ మృతి: నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరి నగరం గ్రామంలో తల్లి బిడ్డ అనుమానాస్పదంగా మృతి చెందారు. గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ ఆమె కూతురు 18 నెలల వయసున్న హన్సిక సోమవారం ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు.చుట్టు పక్కల వాళ్లు వచ్చి చూసేసరికి హన్సిక మృతిచెందగా, నాగేంద్రమ్మ్సు చికిత్స నిమిత్తం నిమిత్తం తరలించారు .మార్గమధ్యంలో ఆమె మృతి చెందారు ఇద్దరి మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. తామే స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. నాగేంద్రమ్మ ఆమె భర్త పవన్ కళ్యాణ్ తో తరచూ ఘర్షణ పడుతుండేదని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:ఎదుర్లంక వారధిపై ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Last Updated : Apr 19, 2022, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.