తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు ప్రవాహ ఉద్ధృతికి నిన్న కారు గల్లంతైన ఘటనలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్వేతతో పాటు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బాలుడు ఇషాంత్ కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తున్నారు. నిన్న రాత్రి వరద ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వరుడు నవాజ్ రెడ్డి, ఆయన సోదరి రాధమ్మ ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదీ జరిగింది..
భారీ వర్షం కురవడంతో వాగు ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు వద్ద జరిగిన ఘటనలో నవవధువు, ఆమె బంధువులు ముగ్గురు గల్లంతయ్యారు.
ప్రమాదంలో గల్లంతైన నవవధువు ప్రవల్లిక
పెళ్లి కుమారుడు, అక్క బయటకు దూకేశారు...
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్రుతి, ఓ బాలుడు, మరో బంధువు రాఘవేందర్‌రెడ్డి రావులపల్లికి కారులో బయలుదేరారు. తిమ్మాపూర్ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చిన్న వాగే కదా అని వారు ముందుకు సాగారు. నీటి ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. పెళ్లి కుమారుడు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్ తెరిచి కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.
ప్రమాదం నుంచి బయటపడ్డ నవాజ్ రెడ్డి, రాధమ్మలు
ఇదీ చదవండి: