theft case : గుంటూరు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ నుంచి రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి, 86 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో గురజాలలో సెల్‌ఫోన్ దొంగతనం కేసులో దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా ఈ భారీ చోరీ బయటపడింది.
గుంటూరుతో పాటు విజయనగరం, అచ్చంపేట, గురజాలలో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా దొంగను పట్టుకున్న పోలీసులకు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ నగదు పురస్కారాలను అందజేశారు.
ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ...ఇద్దరు దుర్మరణం