ACCIDENT : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిలోని అవిలాల వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కాణిపాకం నుంచి తిరుచానూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇవీ చదవండి: