ETV Bharat / crime

తెలంగాణ: ఏటీఎం యంత్రం ధ్వంసానికి యత్నించిన దుండగుడు - ATM destroyed in Krishnanagar

హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌ శ్రీనగర్ కాలనీ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఏటీఎం యంత్రం బండరాయితో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. యంత్రం తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు

The assailant who tried to destroy the ATM machine at krishnanagar

author img

By

Published : May 7, 2021, 1:45 PM IST

హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే కూకటపల్లిలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఏటీఎం వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భద్రతా సిబ్బంది చనిపోగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మేడ్చల్‌ జిల్లాలో గండిమైసమ్మ కూడలిలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌లో గోడకు కన్నం వేసిన దుండుగులు చోరీకి విఫలయత్నం చేశారు.

గురువారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌ శ్రీనగర్ కాలనీ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఏటీఎం యంత్రం బండరాయితో ధ్వంసం చేసేందుకు యత్నించాడు. అయితే యంత్రం తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

హైకోర్టు తీర్పు : సంఘం డైయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.