Death of tenant farmer: నేల వాలిన పంటను చూసి.. గుండె పోటుకు గురై.. ఓ కౌలు రైతు మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మోపర్రు గ్రామ శివారు పొలాల్లో జరిగింది. చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన ఎ. సుబ్బారావు (47) మోపర్రు శివారులో ఐదు ఎకరాలు పొలాన్ని కౌలుకు తీసుకుని వరి వేశారు.
ఇటీవల వాయుగుండం ప్రభావంతో.. వీచిన గాలి వానలకు.. రెండు ఎకరాల్లో పంట నేల వాలింది. గురువారం పొలం వెళ్లిన సుబ్బారావు.. దెబ్బ తిన్న పంటను చూసి మనస్థాపానికి గురయ్యి ఒక్కసారిగా కుప్పకూలాడు. పక్క పొలాల్లో ఉన్న రైతులు గమనించి.. ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలోనే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని..కన్నీరుమున్నీరయ్యారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున.. మృతదేహాన్ని చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులను కోరారు. మృతుడికి భార్య ,ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
ఇవీ చదవండి: