ETV Bharat / crime

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. తానా బోర్డు సభ్యుడు నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి - ROAD ACCIDENT AT AMERCIA

ROAD ACCIDENT AT AMERCIA
ROAD ACCIDENT AT AMERCIA
author img

By

Published : Sep 27, 2022, 10:00 AM IST

Updated : Sep 27, 2022, 10:42 AM IST

09:56 September 27

కుమార్తెలను తీసుకొచ్చేందుకు కళాశాలకు వెళ్లిన శ్రీనివాస్ భార్య వాణి

ROAD ACCIDENT AT AMERCIA : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన తానా బోర్డు సభ్యుడు కొడాలి నాగేంద్ర శ్రీనివాస్​ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ హ్యూస్టన్‌‌లో నివాసం ఉంటున్నారు.. భార్య వాణి ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు కుమార్తెల్లో.. పెద్ద కూతురు వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది. దసరా పండుగ కోసం పెద్ద కుమార్తెను తీసుకురావడానికి వాణీ, ఆమె చిన్న కుమార్తె వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ప్రమాదంపై తానా సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌కి నాట్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌‌ది కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి కాగా.. గుంటూరు మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. అనంతరం 1995లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు వెళ్లారు. పీడియాట్రిక్‌ కార్డియోవాస్క్యులర్‌ అనస్థీషియాలజిస్ట్‌గా అమెరికాలోని హ్యూస్టన్‌‌లో కుటుంబంతో స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డు సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి కొడాలి రామ్మోహన్ రావు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి విజయవాడలో స్థిరపడినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 27, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.