ETV Bharat / crime

Maoist arrest: తెలంగాణలో ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్ట్​ - bhadradri kothagudem district news

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరు అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు భద్రాచలం ఏఎస్పీ పేర్కొన్నారు. వారిని రిమాండ్​కు తరలించారు.

Maoist militia members arrest at pusaguppa
తెలంగాణలో ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్ట్​
author img

By

Published : Sep 4, 2021, 4:52 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసగుప్ప వద్ద ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిలో ఒక బాలుడు(17) ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పూసగుప్ప వద్ద.. పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోతున్న ఆరుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ జి. వినీత్ తెలిపారు.

ఈ ఆరుగురు ఛత్తీస్​గఢ్​కు చెందినవారని.. రెండు మూడేళ్లుగా మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారని ఏఎస్పీ పేర్కొన్నారు. వీరు పోలీసులను హతమార్చేందుకు ప్రయత్నాలే గాక, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లోనూ పాల్గొన్నట్లు వెల్లడించారు. ఐదుగురిని రిమాండ్​కు తరలించగా.. మైనర్ బాలుడిని జువైనల్ హోంకి తరలించినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

IAS TRANSFERS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.