ETV Bharat / crime

Hyderabad girl rape: సైదాబాద్‌ బాలిక హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు - సైదాబాద్‌ బాలిక హత్య నిందితుడు

హైదరాబాద్​ సైదాబాద్‌ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో అరెస్టు చేశారు. రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నిందితుడిని హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ వెల్లడించారు.

Saidabad girl murder accused in police custody

author img

By

Published : Sep 11, 2021, 10:52 AM IST

హైదరాబాద్​ సైదాబాద్‌ బాలిక హత్య ఘటన నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం తెలంగాణ యాదాద్రి జిల్లాలోని అడ్డగూడూరులో రాజును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ వెల్లడించారు. రాజు స్వగ్రామం అడ్డగూడూరని తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌ తరలించినట్లు పేర్కొన్నారు. బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా రాజు ఉన్నాడు.

ఇదీ జరిగింది...

గురువారం సాయంత్రం హైదరాబాద్‌ సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక అదృశ్యమైంది. సాయంత్రం నాలుగు- ఐదు గంటల మధ్య బయటకు వెళ్లిన చిన్నారి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు కాలనీ అంతా జల్లెడ పట్టారు. తెలిసినవాళ్లు, స్థానికుల సాయంతో.. అంతా వెతికారు. 9 గంటల సమయంలో పామ మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కాలనీ చుట్టుపక్కల వెతికారు. పక్కన గదిలో ఉండే రాజు కనిపించకపోవడంతో అతడిపై బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. రాజు కోసం వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో... రాత్రి 12 గంటల సమయంలో గది తాళాలను పగులగొట్టారు. ఆ తల్లిదండ్రులు ఏదైతే జరగకూడదు అని బలంగా కోరుకున్నారో అదే వాళ్ల కళ్లేదుట కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఆ బుజ్జాయిని ఆ స్థితిలో చూసి.. తల్లిదండ్రులు బోరుమన్నారు. స్థానికులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న చిన్నారి మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఆరోపించారు. చిన్నారిపై దురాఘతానికి పాల్పడ్డాడన్న ఆలోచనే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. "ఆ మానవమృగాన్ని మాకు అప్పగిస్తారా...? మీరే ఎన్​కౌంటర్​ చేస్తారా..?" అంటూ కోపంతో ఊగిపోయారు.

చంపాపేట్​లో ఉద్రిక్తత..

నిన్న ఉదయం 7 గంటలకు చంపాపేట్ వద్ద సాగర్ రోడ్డుపై కాలనీవాసులంతా నిరసనకు దిగారు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు రాజును ఎన్​కౌంటర్​ చేయాలని లేదా తమకు అప్పగించాలని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కాలనీవాసులకు నచ్చజెప్పే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో చంపాపేట్​ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళన మధ్యే.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అందరూ ఆరోపించినట్టుగానే...

కాలనీవాసులు ఆరోపించినట్టుగానే.. పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది. చిన్నారిపై ఆ మానవమృగం అత్యాచారం చేసి... హత్య చేసినట్టు తేలింది. చిన్నారిని అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. చిన్నారి ఇంటి పక్కన గదిలో నివాసం ఉండే రాజు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సొంత గ్రామానికి తీసుకెళ్లి అశ్రునయనాల మధ్య చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు.

చాక్లెట్​ ఆశ చూపి...

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన రాజుకు వివాహమైంది. ఆరు నెలలుగా సైదాబాద్​లోని కాలనీలో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాజు వేధింపులు తట్టుకోలేక.. భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న రాజు... చిల్లర దొంగతనాలు కూడా చేశాడు. మొన్న సాయంత్రం 4 గంటల సమయంలో చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి గదిలోకి తీసుకెళ్లిన రాజు.... హత్యాచారం చేశాడు. ఆపై గొంతు నులిచి చంపేశాడు. చిన్నారి మృతదేహాన్ని పరుపులో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేద్దామని నిందితుడు భావించినప్పటికీ... వీలు కాకపోవడంతో గదిలో పెట్టి తాళం వేసి వెళ్లినట్టు పోలీసులు నిర్ధరించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి కోసం సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాజు కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు గురించిన వివరాలపై కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు..

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.