SAD INCIDENT AT VINAYAKA CELEBTRATIONS : నెల్లూరులో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదుగురు మృతి చెందిన ఘటన మరువకముందే ఆత్మకూరులో నిర్వహిస్తున్న వినాయకచవితి వేడుకల్లో అపశృతి జరిగింది. బంగ్లా సెంటర్లో జరుగుతున్న ఉట్టి కార్యక్రమాలను చూసేందుకు సుమారు 15 మంది వ్యక్తులు ఇంటిపైకి ఎక్కారు. ఉన్నట్టుండి సన్‌షేడ్ కూలడంతో వెంకట నీరజ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. సుజాత అనే మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మరో 13మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: